Drunk and Drive | కుత్బుల్లాపూర్, ఆగస్టు11: రోడ్డుపక్కనన డుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు పోకిరీల కారణంగా బలయ్యాడు. అతిగా మద్యం తాగి, రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వె ళ్తూ.. నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన కూన మనీశ్‌గౌడ్ శనివారం రాత్రి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. మత్తులోనే రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు టీఎస్10ఈఈ600 నంబర్ గల మహేంద్ర ఎక్స్‌యూవీ 500 వాహనంలో వెళ్లారు.
వాహనాన్ని మనీశ్‌గౌడ్ నడుపుతుండగా స్నేహితులు అదే కారులో ఉన్నారు. ఉదయం నిజాంపేట నుంచి దేవేందర్‌నగర్ మూలమలుపు వద్దకు రాగానే రోడ్డు పక్కన నడుచుకుం టూ వెళ్తున్న గాజులరామారం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన భాషా గోపి(38)ని కారు ఢీకొని 10 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో గోపి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే కారులో ఉన్న మిగతా యువకులు తప్పించుకొని పారిపోగా, డ్రైవింగ్ సీటు లో ఉన్న మనీశ్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.