మర్పల్లి, మే 24 : ఆన్లైన్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలైన ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి మండలం కోట్మర్పల్లికి చెందిన బోయిని పాండు కుమారుడు బోయిని విజయ్‌కుమార్ (23) వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ యాప్‌లో బెట్టింగ్ ఆడాడు.
దీనికోసం రూ.3లక్షల వరకు అప్పుకాగా వాటిని ఎలా తీర్చాలోనని మనస్తాపం చెందాడు. ఈక్రమంలో శనివారం మర్పల్లి- కొత్లాపూర్మధ్య హైదరాబాద్-పూర్ణాప్యాసింజర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకోపైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.