కాజీపేట, మే 26: ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండలో వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండ లం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్ (28) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఏడేండ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. పని చేసే చోట పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి కుటుంబ సభ్యుల కు.. ఇటీవలే వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్‌కుమార్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దీంతో రాజ్‌కుమార్ ఎదురు తిరగగా అమ్మాయి బంధువులు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమ్మాయి బంధువులు చంపేస్తామని బెదిరించడంతో మనస్తాపం చెందిన రాజ్‌కుమా ర్.. ఏడేండ్లుగా సాగిన ప్రేమ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బంధువులు, మిత్రులకు పంపిచాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు, బంధువులు వెతకగా సూర్యాపేట లో దొరికాడు. రాజ్‌కుమార్‌కు ఎంత చెప్పినా తనకు ఆత్మహత్యే శరణ్యమని, తనను బెదిరించిన వ్యక్తిపై కేసు న మోదు చేయించాలని అందరినీ మాటల్లో దించి అక్కడి నుంచి పరారయ్యాడు. సూర్యాపేటలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం నల్లగొండ స మీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. యువతి కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.