వర్ధన్నపేట, జూన్ 16: వరంగల్ జిల్లాలో(Warangal) విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలంలోని రాంధాన్తండాలో ఆదివారం విద్యుత్ షాక్‌తో(Electric shock) రైతు మృతి(Young farmer died) చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన రైతు గుగులోత్ దేవేందర్(30) ఉదయం వ్యవసాయ బావి వద్ద విద్యుత్ మోటర్‌ను ఆన్ చేసే క్రమంలో షాక్ కొట్టి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
పక్క భూముల వద్ద ఉన్న రైతులు గుర్తించి దేవేందర్‌ను హాస్పిటల్‌కు తరలించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవేందర్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.