అక్కన్నపేట, మే 15: నెల రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని యువరైతు ఆత్మహత్యకు యత్నించాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటకు చెందిన వంగాల శ్రీనివాస్‌రెడ్డి ఏప్రిల్ 15న వరికోతలు పూర్తి చేశాడు. నెల గడుస్తున్నా కాంటా చేయకపోవడంతో శుక్రవారం రాత్రి తనపై పెట్రోల్ పోసుకున్నాడు.
వడ్లపై కూడా పెట్రోలు పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే 30 బస్తాల వడ్లు చెదలు పట్టాయని, తన చావుతోనైనా మిగిలిన రైతులకు న్యాయం జరుగుతుందని ఇలా చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.