కొల్లాపూర్, ఆగస్టు 9 : ఎల్‌నినో ఎఫెక్ట్ నుంచి బయట పడుతున్నా, కాంగ్రెస్ ప్రభు త్వ నిబంధనల సుడిగుండం నుంచి బయటపడలేని స్థితిలోకి రైతులు నెట్టివేయబడ్డారు. బీఆర్ఎస్ నాయకుల హెచ్చరికతో తప్పనిస్థితిలో ఎంజీకేఎల్ఐ పంప్‌లను ఆన్ చేసిన ప్రభు త్వం ఎంజీకేఎల్ఐ కింద సాగు విస్తీర్ణం తగ్గించేందుకు వ్యవసాయ అధికారులకు టార్గెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎల్‌నినోను బూచీగా చూపి పంటల విస్తీర్ణం తగ్గించి మళ్లీ వలసల పయనం చేయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టినట్లు ఉందని రైతులు విమర్శిస్తున్నారు. ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణానదికి వరద వచ్చినా పంపులను ఆన్ చేయడంలో జరిగిన ఆలస్యం గురించి అధికారులు వివరణ ఇచ్చి ఉం టే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అత్యధికంగా వరి పంటను సాగుచేసి రికార్డు స్థాయిలో దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆగ్రస్థానంలో ఉన్నది. అంతేకాదు ఆయిల్‌పాం పంటల సాగుతో రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించారు. పాడిపంటలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా పంటల సాగుపై ఆంక్షలు పెట్టడం సరైనది కాదని రైతు సంఘాల నాయకులు పే ర్కొంటున్నారు. శ్రీశైలం జలాశయంలో నీళ్లు పుష్కలం గా ఉన్నా రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయకుండా ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వ ఆంక్షల అంతర్యం ఏమిటో ప్రశ్నగా మిగిలిపోయింది. పంటల సాగును గణనీయంగా తగ్గించేందుకు ఇన్ని రోజులు ఎంజీకేఎల్ఐ మోటర్లను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఆన్ చేయలేదని విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఆంక్షలతో జిల్లాలో పంటల విస్తీరణం గణనీయంగా తగ్గింది.
ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ఆ యకట్టుకు ప్రమాదం పొం చి ఉంది. సమైఖ్య పాలకులు ఎంజీకేఎల్ ఐ ప్రాజెక్టు ఆ యకట్టు ను, కృష్ణా బేసిన్లో నికర వాటాను, అఖరికి మెయిన్ కెనాల్తోపాటు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ సామ ర్థ్యం కుదించినా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీల వరకు శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను లిప్ట్ చేశారు. దీంతో ఎంజీకేఎల్ఐ ప్రా జెక్టులోని స్టేజీ -1, స్టేజీ-2,స్టేజీ-3ల కింద 30వేల ఎకరాలోపు ఉన్నా పంటల సాగు విస్తీరణాన్ని 4.25లక్షల ఎకరాల ఆయకట్టు వరకు తెలంగాణ తొలి ప్రభుత్వం పెంచిం ది.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తో ఎంజీకేఎల్ఐ ఆయకట్టు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కృష్ణానదికి గత నెల మూడో వారంలోనే వరద ప్రా రంభమైనది. వరద జలాలు వస్తున్న విషయాన్ని గమనించి ఎంజీకేఎల్ఐ పంప్‌లను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపి ఉంటే ఎంజీకేఎల్ఐ ఆయకట్టు తగ్గేది కాదు. కానీ ఎంజీకేఎల్ఐ పంప్‌లను ఆన్ చేయకపోవడంతో రైతులు వానకాలం సీజన్ పంటలను ప్రారంభించలేకపోయారు. ఎంజీకేఎల్ఐ ఆయకట్టును తగ్గించేందుకే శ్రీశైలం జలాశ యం నిండుకుండలా ఉన్నా పంప్‌లను ఆన్ చేయకుండా ప్రభు త్వం కుట్ర చేసిన విషయం అర్థం అవుతోంది.
ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు కింద అధికారికంగా నాలుగు లక్షల 25వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉన్నది. అనధికారికంగా ఎంజీకేఎల్ఐ ఆయకట్టు బీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత మరింత పెరిగింది. జిల్లాలో దాదా పు 30వేల ఎకరాలలో సాగు అవుతున్న మామిడితోటను మినహాయించిన, వేలాది ఎకరాలలో సాగు అవుతు న్న ఆయిల్ పాం పంటల సాగును పక్కన పెట్టిన గతేడాది వానకాలం సీజన్ సంబంధించిన అధికారిక లెక్కల ప్రకారమే 5,92,903 ఎకరాలలో పంట విస్తీర్ణం సాగైంది. కానీ నేడు వానకాలం సీజన్ ముగింపు దశకు చేరుకుంటు న్నా గతేడాది సంబంధించిన పంట విస్తీరణం లో 2/3 వం తు కూడా సాగుకు నోచుకలేదు. పంటల సాగు విస్తీర్ణం తగ్గడంలో ఎల్‌నినో ఎఫెక్ట్ కంటే ప్రభుత్వం చేసిన కుట్రనే అధికంగా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది జిల్లాలో 309,744 ఎకరాలలో పత్తిని సాగుచేస్తే ఈ ఏడాది 2,50,687 ఎకరాలలో సాగు అయినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతేడాది వరి పంట 180,739 ఎకరాలలో సాగు అయితే, ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం కేవ లం 55,253 ఎకరాలలో మాత్రమే వరి పంటను సాగు చేశారు. వరి పంట సాగు పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ముఖ్యంగా వరి పంటల సాగు విస్తీర్ణం త గ్గించేందుకు విఫల ప్రయత్నం చేస్తోంది. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరితో పాటు మరికొన్ని పంటల సాగు విస్తీర్ణం తగ్గించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల అవగాహన కార్యక్రమాలతో సాగునీళ్లు ఉన్నా ఏ పంటలను సాగు చేయాలో తెలియని అయోమయ స్థితిలోకి రైతులు వెళ్తున్నారు.
ఎంజీకేఎల్ఐ ఆయకట్టు విస్తీర్ణం తగ్గించేందుకు ప్రభు త్వం ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ప్రత్యేక టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రామాలలోని ఏఈవోలు ప్రతిఒక్కరూ 100 ఎకరాల వరకు కూరగాయాల తోటను పెంచేందుకు కృషి చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీలైనంత వరకు వరి పంటను పూర్తిస్థాయిలో తగ్గించాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో ఎంజీకేఎల్ ప్రాజెక్టులోని ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి లిఫ్ట్ ల నుంచి సాగునీరు విడుదల చేశారు. దీంతో ముమ్మరంగా పంటల సాగుకు సిద్ధమవతున్న రైతులపై అధికారుల ఒత్తిడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు కింద వానకాలం సీజన్ పంటలను పూర్తిస్థాయిలో పండించుకునేందుకు ఎలాంటి ఢోకా ఉండదని కొంత మంది రైతు సంఘాల అభిప్రాయం, కానీ ప్రభుత్వం పంటల విస్తీర్ణం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. పంటల విస్తీర్ణం తగ్గింపు వెనుక రైతు భరోసాకు ఎగనామం పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా అనే ప్రశ్న తల్తెతుంది. గతేడాది వానకాలంలో పంటలను సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసాను అందించారు.
కొన్ని చోట్ల ఆలస్యంగా సాగు చేసిన రైతులకు కూడా రైతు భరోసా అందలేదు. చాలా వరకు వరి పంటలను సాగుచేసే చోట మరే ఇతర పంట సాగుకు పనికి రాకుండా ఉంటుంది. అలాంటి చోట్ల పంటలకు క్రాప్ హా లీడే ప్రకటిస్తే రైతులు పంట నష్టంతోపాటు పొలంలో జ మ్ము మొలసి సాగు స్వభావం కోల్పోయే అవకాశం ఉం టుందని రైతులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో నీళ్లు వచ్చాయని సంతోషం ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంటల సాగుపై పెడుతున్న ఆంక్షలను చూసి భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.