అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధ్దాలు
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మం డిపడ్డారు. శుక్రవారం ఆయన గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రవల్లిలో ని సర్వే నంబర్ 325లో 388.10 ఎకరాలు దళితుల కబ్జాలోనే ఉన్నాయని, రైతులే సాగు చేసుకొని పంటలు పండించుకుంటున్నరని తెలిపారు.
- అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్‌రెడ్డి
- కొండను తవ్వి ఎలుకను పట్టిన కాంగ్రెస్ బృందం
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, సెప్టెంబర్ 18: రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మం డిపడ్డారు. శుక్రవారం ఆయన గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రవల్లిలో ని సర్వే నంబర్ 325లో 388.10 ఎకరాలు దళితుల కబ్జాలోనే ఉన్నాయని, రైతులే సాగు చేసుకొని పంటలు పండించుకుంటున్నరని తెలిపారు.
రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు చేపడుతున్న సర్వేతో కేసీఆర్‌కు సర్వే నంబర్ 325తో ఎలాంటి సంబంధం లేదనే విషయం తే లిపోయిందన్నారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌కు 67ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని రేవంత్‌రెడ్డే ప్రకటించారని, అందులో గజం కూడా ప్రభుత్వ భూమి లేదనే విషయాన్ని అధికారులే దృవీకరిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎక్కడ తమ ప్రభుత్వాన్ని నిలదీస్తారోననే భ యంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో వెయ్యి ఎకరాలు లేకపోతే రేవంత్ రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి కు టుంబసభ్యుల ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధర్నాలు చేసి నిలదీసిన సందర్భాలు ఉంటాయి కానీ.. ఇక్కడ అధికారంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సు యాత్రలు చేస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉన్నదని ఎద్దేవాచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

