భీమదేవరపల్లి, డిసెంబర్ 22: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులోని హనుమత్పురి పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం మహిళల కోలాట నృత్య ప్రదర్శన జరిగింది. 67 గ్రామాల నుంచి 936 మంది మహిళలు హనుమాన్ చాలీసాపై కోలాట నృత్య ప్రదర్శన చేశారు. ముఖ్య అతిథిలుగా స్పిరుచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు జాతీయ కోఆర్డినేటర్ వెంకటరమణారావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హాజరయ్యారు.
మహిళల కోలాట నృత్య ప్రదర్శన స్పిరుచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైనట్టు కోఆర్డినేటర్ ప్రకటించి మెమెంటోను ప్రదానం చేశారు. వందలాది మహిళలను ఒకే వేదికపైకి సమీకరించి కోలాటం నేర్పిన శ్వేతను అభినందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాసం రమేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు.