కొల్లాపూర్, జూన్ 20: తనపై దొంగతనం నింద మోపడంతో అవమానానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నంబావి మండలం వెల్టూరుకు చెందిన శ్రీలక్ష్మి (30), వెంకటేశ్వర్లు దంపతు లు. వెంకటేశ్వర్లు హమాలీ పనులు చేసేటో డు. వీరికి పదేండ్ల కూతురు ఉంది. కొన్నేండ్ల కిందట అనారోగ్యంతో కొల్లాపూర్‌లోని సా యికృప ప్రైవేట్ దవాఖానలో వైద్యం కోసం వెళ్లింది. అక్కడ డాక్టర్‌గా చెలామణి అవుతు న్న కొండ శ్రీనివాసులు వైద్యం చేయడంతో వికటించి అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా సదరు వైద్యుడు తన దవాఖానలోనే శ్రీలక్ష్మికి ఉద్యోగావకాశం కల్పించాడు. నాటి నుంచి ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణ ఉంది. మానసిక ఒత్తిడితో కరోనా కాలంలో ఉద్యోగం మానేసి సొంతూరికి వెళ్లింది. అక్టోబర్‌లో ద వాఖానలో చోరీ జరిగిందని శ్రీనివాసులు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసుకు సంబం ధం లేకున్నా శ్రీలక్ష్మిని విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిచేవారు. ఐదు రోజుల కిందట మళ్లీ ఆమెను పీఎస్‌కు పిలిపించి దొంగతనం చేసినట్టు అంగీరించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. గురువారం పీఎస్‌కు వచ్చిన ఆమె అవమానంతో మనస్తాపం చెంది స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగింది. నోటి నుంచి నురగలు వస్తుండటం తో పోలీసులు, స్థానికులు కొల్లాపూర్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నదని ఆమె కు టుంబసభ్యులు ఆరోపించారు. కాగా.. కొల్లాపూర్‌లోని శ్రీనివాసులు దవాఖానలో దొంగతనం జరిగినట్టు నిరుడు ఫిర్యాదు చేశాడన్నా రు. విచారణ నిమిత్తం ఐదు రోజుల కిందట శ్రీలక్ష్మిని పోలీస్‌స్టేషన్‌కు రాగా తిరిగి పంపించామని, కానీ.. గురువారం పిలవకున్నా పీఎస్‌కు వచ్చిందని చెప్పారు. ఆమెను ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.