Smart Ration Card | రాష్ట్రంలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం (State Govt) జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పై సీఎం, మంత్రులు ఫొటోలు ప్రింట్ చేయడంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమువుతున్నది. సుదీర్ఘకాలం ఉండే రేషన్‌కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటం ఏమిటని బీజేపీ సహా విపక్షాలు, వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం ఎన్నడు చూడలేదు. రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్ల మీద అతని ఫొటోలు వేస్తారా? మొత్తం ఖమ్మం మంత్రుల అందరి ఫొటోలు వెయ్యకపోయారా.. ఏందీ ఈ గలీజ్ యవ్వారమని మండిపడింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం?
ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం?
రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్ల మీద అతని ఫొటోలు వేస్తారా?
మొత్తం ఖమ్మం మంత్రుల అందరి ఫోటోలు వెయ్యకపోయారా
– నిలదీసిన ఖమ్మం మహిళ pic.twitter.com/kKzXk07prf
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026