చేగుంట : మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాలసాయి జయ, హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం జన్మించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో సోమవారం జయ ముగ్గురు ఆడపిల్లలకు జన్మినిచ్చింది.ఈ దంపతులకు వివాహామైన 13 సంవత్సరాల తర్వాత సంతానం కలగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో గత కొన్నేండ్ల నుంచి వైద్యుల వద్ద చూపించుకుంటున్నారు. ఈ క్రమంలో వివాహామైన 13 ఏండ్ల తర్వాత ఆమె ఈ ఏడాది గర్భం దాల్చింది. నెలలు నిండడంతో సోమవారం మధ్యాహ్నం వైద్యుల పర్యవేక్షణలో జయ ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ముగ్గురు ఆడ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.