HYDRAA | హైడ్రా ఆగడాలపై బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పైసాపైసా కూడబెట్టుకొని సొంత ఇళ్లు కట్టుకుంటే హైడ్రా అధికారులు జేసీబీలతో ఇండ్లను కూల్చివేస్తుండటంతో బాధితులు రోడ్డున పడుతున్నారు. ఈ క్రమలో గండిమైసమ్మలో నా భూమిని హైడ్రా లాక్కుందని ఓ బాధితుడు చెప్పిన వీడియో వైరల్గా మారింది. నా స్థలం బఫర్ జోన్లో లేదు, కాలువ పక్కన లేదు.. అన్ని చెక్ చేసి మంచి స్థలంలోనే కొన్నాను, అయినా సరే హైడ్రా వాళ్లు వచ్చి నా భూమిలో కంచె వేశారు.
నేను కోర్టులో కేసు వేస్తే తీర్పు కూడా నాకు అనుకూలంగానే వచ్చిందని.. అప్పుడు తహసీల్దార్ దగ్గరికి పోతే కట్టుకోండి అన్నాడు. మళ్లీ మరో తహసీల్దార్ వచ్చి ఇళ్లు కూల్చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రజల కోసం అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము. నా ఆటో మీదనే బ్యానర్ కట్టి, మైక్ పెట్టి ప్రచారం చేశాను. ఇవాళ అదే ప్రభుత్వం నా పొట్ట మీద కొడుతుందని నేను అనుకోలేదని వాపోయాడు.
గండిమైసమ్మలో నా భూమిని హైడ్రా లాక్కుంది
నా స్థలం బఫర్ జోన్లో లేదు, కాలువ పక్కన లేదు.. అన్ని చెక్ చేసి మంచి స్థలంలోనే కొన్నాను, అయినా సరే హైడ్రా వాళ్లు వచ్చి నా భూమిలో కంచె వేశారు
నేను కోర్టులో కేసు వేస్తే తీర్పు కూడా నాకు అనుకూలంగానే వచ్చింది.. అప్పుడు MRO దగ్గరికి పోతే… https://t.co/xp0Y3dIxE4 pic.twitter.com/GPvknWFary
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026