Hyderabad | హయత్నగర్, జూన్ 21: పోలీస్ అధికారి లైంగిక వేధింపుల నుంచి రక్షించాలని కోరుతూ ఓ బాధితురాలు శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే… అబ్దుల్లాపుర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరులో సువర్చల, కిరణ్కుమార్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.
ఏసీబీ డిపార్ట్ మెంట్లో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారినంటూ శేఖర్ అనే వ్యక్తి కొంతకాలంగా సువర్చలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనోవేదనకు గురైన బాధితురాలు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.