High Court | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనాన్ని సీజ్ చేసే హక్కు పోలీసులకు లేదు.. తేల్చిచెప్పిన హైకోర్టు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేశారని చెప్పి ఆ వాహనాన్ని మోటరు వాహనాల చట్టం ప్రకారం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
High Court | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేశారని చెప్పి ఆ వాహనాన్ని మోటరు వాహనాల చట్టం ప్రకారం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
‘వాహనానికి సంబంధించి తగిన పత్రాలు చూపితే సీజ్ చేయడానికి వీల్లేదు. వాహనం నడిపే వ్యక్తి మద్యం సేవించినట్టు నిర్ధారణ అయితే, ఆ వాహనాన్ని నడిపేందుకు అనుమతించకూడదు. అదే వాహనంలో మద్యం సేవించని మరో వ్యక్తి ఉండి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాహనాన్ని అతనికి అప్పగించాలి. ఒకవేళ మరో వ్యక్తి లేనప్పుడు మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తికి సమీప బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని తీసుకువెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
ఈ పరిస్థితులు లేనప్పుడు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే దాని యజమాని, ధ్రువీకరించిన వ్యక్తి ఆర్సీ, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ చూపితే వాహనాన్ని అప్పగించాలి..’ అని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కీలక ఉత్తర్వులను జారీచేశారు. మద్యం సేవించి వాహనాన్ని నడిపి పట్టుబడితే రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు నమోదై వాహనాలను స్వాధీనం చేసుకునేటప్పుడు రవాణా శాఖ నిబంధనల్లోని 148 సెక్షన్‌ను విధిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే మూడు రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2025లో సాయిరాంరావు అనే వ్యక్తి మద్యం సేవించి నడిపిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన జే విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి పై ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

