హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు సమర్పించారు. గజ్వేల్ నుంచి అత్యధికంగా 145 మంది, తర్వాత మేడ్చల్లో 116 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అతి తక్కువగా నారాయణపేట నుంచి 13 మంది, తర్వాత వైరా, మక్తల్ నుంచి 19 మంది చొప్పున నామినేషన్ వేశారు. కామారెడ్డిలో 92, ఎల్బీనగర్ 77, మునుగోడు 74, సూర్యాపేట 68, మిర్యాలగూడ 67, సిద్దిపేటలో 62 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సోమవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్లో 438, నల్లగొండలో 428, ఖమ్మంలో 283, ఆదిలాబాద్లో 208, నిజామాబాద్ జిల్లాలో 236 నామినేషన్లు దాఖలు చేశారు.