హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మొత్తం 1,284 గ్రామ పం చాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడత లో 395, మలి విడతలో 495, తుది విడత లో 394 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు బుధవారం ప్రకటించారు. తొలి విడత గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనున్నది. 14న జరిగే రెండో విడత పోలింగ్‌కు బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వీరికి రెండ్రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉన్నది. రెండో విడతలో 3,911 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది పోటీలో ఉన్నారు. ఒక్కో సర్పంచ్ స్థానానికి ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. వార్డుల్లో ముఖాముఖి పోటీ ఉన్నది. 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది. మూడో విడత ఎన్నికలు ఈ నెల 17న జరుగనున్నాయి. ఈ స్థానాల్లో మరో ఐదురోజులపాటు ప్రచారానికి గడువు ఉన్నది. మూడో విడతలో 3,752 జీపీలకు 12,640 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక్కడ కూడా ఒక్కో సీటు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు.
రెండో విడత ఎన్నికల వివరాలు
మూడో విడత ఎన్నికల వివరాలు