పాపన్నపేట్, జూన్ 9: సాగు అప్పులు తీర్చలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో జరిగింది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లేశం (38) పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వనగండ్ల వానకు పంట దెబ్బతింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి.
ఈ క్రమంలో మే 30న పొలం వద్దకు వెళ్లి అక్కడ పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెదక్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.