హైదరాబాద్ : కారులో(Car) అకస్మాత్తుగా మంటలు చెలరేడంతో(Fire broke) కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన జగిత్యాల(Jagityala) జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న సమయంలో పోసానిపేట శివారులోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కారులోని ప్రయాణికులు వెంటనే దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.