హైదరాబాద్ : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు(Train) కిందపడి విద్యార్థి (Student ) ఆత్మహత్య(Committed suicide) చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లిలోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఈరోజు ఉదయం హాస్టల్ నుంచి పారిపోయాడని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. అలాగే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
కాగా, చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద సదరు విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే విద్యార్థి పారిపోవడానికి పాఠశాలకు వాచ్మెన్ లేకపోవడమే కారణమని, వాచ్మెన్ లేకుండా నిర్లక్ష్యంగా పాఠశాల నడిపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులు డిమాండ్ చేశారు. విద్యార్థి స్వగ్రామం జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు అని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.