BRS Party | సూర్యాపేట : ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావాలని సూర్యాపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి, బీఆర్ఎస్ అభిమాని నరసింహ చారి సతీసమేతంగా వచ్చి జిల్లా పార్టీ కార్యాలయంలో రూ. 1016లను సభ నిర్వహణ కోసం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా మొదటినుంచి తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నామని.. త్వరలోనే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు.