హైదరాబాద్: వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) ఉత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లకు టీషర్టులు ఎగుమతి చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 2023లో కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశామన్నారు. 11 యంగ్ వన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలకు భూమిపూజ చేశామని గుర్తు చేశారు. 90 శాతం మంది కార్మికులు స్థానిక మహిళలేనని, ఎంపర్మెంట్కు ఇది నిజమైన చిహ్నమని వెల్లడించారు. అన్ని యూనిట్లు ప్రారంభమైతే.. వరంగల్ ప్రధాన వస్త్ర కేంద్రంగా మారుతుందని వివరించారు. ‘వ్యవసాయం నుంచి ఫ్యాషన్’ నినాదంతో టెక్స్టైల్ పార్కును స్థాపించినట్లు ఎక్స్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
A proud moment for Telangana!
In June 2023, we broke ground for 11 Youngone Corporation factories at Kakatiya Mega Textile Park, Warangal.
Happy to learn that the first unit has begun commercial production, exporting T-shirts to global markets.
Delighted that 90% of the… https://t.co/ilqCuu0cMJ pic.twitter.com/ibd8zlPRFH
— KTR (@KTRBRS) October 11, 2025