Karimnagar | కరీంనగర్ : కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కల్యాణి ప్రసవం కోసం ఈనెల 7న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గురు ఆడ శిశువులు జన్మించారు.
ముగ్గురు పిల్లలు 1.9, 1.7, 1.5 కిలోల చొప్పున బరువు ఉన్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడం అరుదుగా జరుగుతుందని స్త్రీ వైద్య నిపుణురాలు నిశ్చల పేర్కొన్నారు. విజయవంతంగా ప్రసవం చేసిన వైద్య బృందాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, డాక్టర్ అలీం అభినందించారు.