హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సంఘం ఎన్నికల్లో సింగరేణి బ్రాంచ్ ప్రతినిధులు బలపరిచిన బ్లాక్ డైమండ్ ప్యానల్ సంపూర్ణ విజయం సాధించింది. నాగపూర్‌లో జరిగిన అపెక్స్ బాడీ ఎన్నికల్లో బ్లాక్ డైమండ్ ప్యానల్ అభ్యర్థులంతా గెలుపొందారు. అధ్యక్షుడిగా డీఎన్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా సర్వేశ్‌సింగ్ ఎన్నికయ్యారు. సింగరేణి అధికారుల సంఘానికి చెందిన ఏవీ రెడ్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, పీ రాజీవ్‌కుమార్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
జాతీయ సంఘంలో వీరిద్దరికీ చోటు లభించడంలో సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు జకం రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాజశేఖర్‌రావు కీలకపాత్ర పోషించారు. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో సింగరేణికి చెందిన 2 వేల మంది అధికారులతోపాటు కోల్ ఇండియా 8 అనుబంధ కంపెనీలకు చెందిన 16 వేల మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు.