Telangana University | నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్లో ఈఘటన చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో చున్నీతో అశ్విని(24) అనే యువతి ఉరేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తెలంగాణ యూనివర్సిటీలో అశ్విని ఎంఏ తెలుగు చదువుతుంది. ఆమె స్వస్థలం బిర్కూర్ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామం. అశ్విని ఆత్మహత్య తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.