హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో శశిధర్ అనే ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి వెంటనే సీఎంవో కార్యాలయానికి సమాచారం అందించారు. సీఎంవో అధికారులు రేణిగుంట విమానాశ్రయ, వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ కాగానే వైద్యులు శశిధర్‌కు సకాలంలో వైద్యం అందించడంతో కోలుకున్నాడు.