Suryapeta | హైదరాబాద్ : ఐదు నెలలుగా జీతాల్లేవని, కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మధుసూదన్ అనే వ్యక్తి సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా గత కొన్నేండ్ల పని చేస్తున్నాడు. అయితే వీరికి రేవంత్ సర్కార్ గత ఐదు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మధుసూదన్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ, గత 5 నెలలుగా జీతాలు లేవని భిక్షాటన చేస్తూ రోడ్డుపై నిరసన తెలిపారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఎన్నిసార్లు కలిసి సమస్యలు చెప్పినా తమ ఇబ్బందులు పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి, ఇకనుండి ప్రతీ నెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్‌కు 5 నెలలుగా జీతం రావడం లేదని ఆత్మహత్యాయత్నం
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో పురుగుల మందు తాగిన మధుసూదన్
పరిస్థితి విషమించడంతో… https://t.co/f7JK2mtkXX pic.twitter.com/rHDyrpikgo
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2025