నందిగామ, ఆగస్టు 4: ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొనడంతో తల్లీకొడుకు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ దర్గా రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన హాజీర బేగం(35) తన ఇద్దరు కుమారులు అబ్దుల్ రహమాన్(12) అబ్దుల్ రహీంతో కలిసి జేపీ దర్గాకు స్కూటీపై వెళ్తుండగా రంగాపూర్ మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దవాఖానకు తరలిస్తుండగా హాజీర బేగం, అబ్దుల్ రహమాన్ మృతి చెందారు. రహీం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.