ఆసిఫాబాద్, సెప్టెంబర్ 8 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సకాలంలో దవాఖానకు తరలించి చికిత స అం దించడంతో ఆయనకు ప్రాణా పాయం తప్పింది. అధికారులు, సిబ్బందితో జరిగే సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా ఈ ఘటన జరింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రామకృష్ణకు శుక్రవారం ఉదయం ఇంట్లో ఉండగా ఛాతీలో నొప్పి వచ్చింది.
అక్కడే ఉన్న హెచ్‌ఈవో రఫీద్ఖాన్ గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్‌లో తీసుకెళ్లి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి ఆయనకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి. అధికారులు, సిబ్బందితో సమావేశానికి సిద్ధమవుతుండగా గుండెపోటు వచ్చినట్టు తెలిసింది. కాగా, ఆయన స్థానంలో డాక్టర్ తుకారం శుక్రవారం ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించారు.