హైదరాబాద్ : తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన ఓ కొత్త అల్లుడిని అత్త సర్ప్రైజ్ చేసింది. కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసింది. అయితే 101 రకాల వంటకాల్లో ఒక వంటకం తగ్గడంతో అల్లుడు కోరిన విధంగా అత్త తులం బంగారం బహుమానంగా ఇచ్చింది.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సురేశ్, సహన దంపతులు తమ కుమార్తె సింధుకు, వరంగల్‌కు చెందిన నికిత్ అనే అబ్బాయికి ఇచ్చి 2 నెలల క్రితం పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ కావడంతో అల్లుడికి 101 రకాల వంటకాలతో అత్తమామలు విందు భోజనం ఏర్పాటు చేశారు. 101 రకాల వంటకాలలో ఒక వంటకం తగ్గింది అని నిరూపిస్తే ఏమిస్తారని అత్తమామలను నికిత్ సరదాగా అడిగారు. 1 వంటకం తగ్గితే 1 తులం బంగారం ఇస్తామానడంతో, లెక్కేసి చూపించి అల్లుడు తులం బంగారం దక్కించుకున్నాడు.
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం
ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్న అల్లుడు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన కూతురు సింధుకు, నికిత్ అనే అబ్బాయికి ఇచ్చి 2 నెలల క్రితం పెళ్లి చేసిన గుంత సురేష్, సహన దంపతులు
పెళ్లి తర్వాత… pic.twitter.com/l1zlHMtWBB
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025