మెదక్ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందినా కొంతమంది ప్రజలు ఇంకా మూఢ నమ్మ కాలను వీడటం లేదు. హైటెక్ యుగంలో సైతం మంత్రాలు(Mantras), బాణమతి, చేతబడి చేశారనే అనుమా నంతో దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో (Medak Dist) అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ముగ్గురిపై దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి(Brutal murdered )చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషాదకర సంఘటన జిల్లాలోని టెక్మాల్ మండలం గొల్లకుంట తండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులను మంత్రాల నెపంతో చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డా రు. ఈ దాడిలో రాములు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sagar Left Canal | సాగర్ ఎడమ కాలువకు గండి.. పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
Dindi Vagu | డిండి వరదలో చిక్కుకున్న చెంచులు సురక్షితం
Jr NTR | తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. రూ.కోటి విరాళం ప్రకటించిన ఎన్టీఆర్