IDA bollaram : సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐడీఏ బొల్లారంలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మూడంతస్తుల భవనం పైనుంచి జారి కింద రేకుల ఇంటిపై పడగానే రేకులు విరిగిపోవడంతో ఆ ఇంట్లోని వ్యక్తులపై పడ్డాడు. ఈ ఘటనలో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి మరణించాడు.
భవనంపై నుంచి పడిన యువకుడితోపాటు రేకుల ఇంట్లోని మృతుడి భార్యకు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భార్యా కొడుకుతో కలిసి ఇంట్లో పడుకున్న వ్యక్తిని మృత్యువు ఈవిధంగా కబలించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.