పటాన్చెరు రూరల్, జూలై 7: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండ లం చిట్కుల్ గ్రామ ంలో ఫ్యాన్‌కింద టవల్‌తో ఆడుకుంటున్న చిన్నారి మెడకు టవల్ చుట్టుకుని ఊపిరాడక మృతిచెందింది. పటాన్చెరు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సోమవారం చిట్కుల్ గ్రామంలో వడ్ల నరసింహాచారి తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో కుమార్తె సహస్త్ర (9), కుమారుడు గణేశ్ఈశ్వర్ ఉన్నారు. సహస్త్ర తమ్ముడితో ఆడుతున్న సందర్భంలో కరెంటు లేక నిలిచిపోయిన సీలింగ్ ఫ్యాన్ రెక్కకు స్టూల్‌పైకి ఎక్కి టవల్ వేశారు. ఆ టవల్‌ను సహస్త్ర మెడకు చుట్టుకుని ఆడుకుంటున్నారు. అదే సమయంలో కరెంటు రావడంతో ఫ్యాన్ వేగంగా తిరుగుతూ టవల్ సహస్త్ర మెడకు బిగుసుకొని ఊపిరాడక చనిపోయింది. నరసింహాచారి ఫిర్యాదుమేరకు పటాన్చెరు ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.