మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి) : ప్రమాదవశాత్తు బురద పొలంలో పడి వ్యక్తి మృతి( Man died) చెందిన సంఘటన సిద్దిపేట(Siddipet) జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ భువనేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సిద్రమైన స్వామి (56) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం స్వామి తన పొలం వద్దకు వెళ్లున్నట్లు ఇంటిలో చెప్పి వెళ్లాడు. చీకటి పడినా స్వామి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కలత చెంది పొలం వద్దకు వెళ్లి వెతికారు. స్వామి తన పొలంలో ఒడ్డు పై నడుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బురదలో బొక్క బోర్ల పడి మృతి చెందాడు. మృతుని కుమారుడు సిద్రమైన బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.