జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwala district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో(Lorry collided )ఒకరు మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముందు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో లక్ష్మీదేవి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ దవాఖానకు108 హైవే అంబులెన్స్ ద్వారా తరలించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామానికి చెందిన మహిళా కూలీలు ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి రోజు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.