ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం
బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ పిలుపునిచ్చారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బషీర్‌బాగ్‌లో ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- మాదిగలను అణగదొక్కుతున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ
రవీంద్రభారతి, ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ పిలుపునిచ్చారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బషీర్‌బాగ్‌లో ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరూ సమానంగా జీవించాలని బాబు జగ్జీవన్‌రామ్ కలలు కన్నాడని, కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆయన స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ మాదిగలకు అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలో మాల సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి, స్పీకర్‌గా అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌ను నియమించడం దారుణమన్నారు. మూడు ఎంపీ టికెట్లలో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం జగ్జీవన్‌రామ్ ఆశయాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గం వారు ఎన్ని తిట్టినా వారిని వెనకేసుకొచ్చిన రేవంత్‌రెడ్డి బక్క జడ్సన్ అనే మాదిగ బిడ్డను మాత్రం పార్టీ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు మంచి బుద్ధి ప్రసాదించమని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
బాబు జగ్జీవన్‌రామ్‌కు అవమానం
ఎలక్షన్ కోడ్ సాకుగా చూపి జగ్జీవన్‌రామ్ జయంతిని ప్రభుత్వం చాలా అవమానకరంగా నిర్వహించిందని, సీఎం రేవంత్‌రెడ్డి కనీసం జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేయకపోవడం ఆయనను అవమానించడమే పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలడుగు శ్రీనివాస్, పెంజర రమేశ్, శ్రీనివాస్ నంగునూరి, వేణు, యాదగిరి, కొల్లూరి వెంకటేశ్, రాహుల్, నరేశ్, సాయన పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

