హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో ప్రభుత్వ ఉద్యోగి చిక్కారు. నగరంలోని బండ్లగూడ డిప్యూటీ విద్యాశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant ) గా పనిచేస్తున్న శివప్రసాద్ బుధవారం ఓ స్కూల్ యాజమాన్యం నుంచి రూ. 10 వేలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు.
పదవతరగతి పరీక్ష కేంద్రం నుంచి తమ పాఠశాలను తొలగించవద్దని బాధితుడు కోరగా అందుకు శాఖాధికారులు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు.