మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident )చోటు చేసుకుంది. పండుగను సంబురంగా జరుపుకోవాలని ఆశించిన ఆ జంటకు విషాదమే మిగిలింది. పండుగ షాపింగ్ చేసి తిరుగు ప్రయాణ మవుతుండగా మృత్యువు వారిని కబలించింది. కారు బోల్తా పడటంతో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామ శివారులోని జాతీయరహదరి -161 పై తెల్లవారు జామున చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోలక్ పల్లికి చెందిన నారాయణ (60), దేవమణి (57) అనే దంపతులు దసరా షాపింగ్ చేసుకొని హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డిలో ని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.