వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంలో(Market yard warehouse) సోమవారం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మార్కెట్ గోదాంలో మంటలు చెలరేగి గన్నీ బ్యాగులు, వడ్ల బస్తాలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన వెంటనే మార్కెట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో 70 వేల ధాన్యం బస్తాలు, 15 లక్షల గన్నీ సంచులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.