నిజాంపేట,జనవరి4 : విద్యుత్ షాట్ సర్క్యూట్( Shot circuit)తో ఇల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన మెదక్ (Medak)జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఆర్ఐ గంగాధర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పందిరి రుక్మయ్య ఇంట్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో షాట్ సర్క్యూట్ జరుగడంతో మంటల చేలరేగాయి.గమనించిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా అప్రమత్తమై ఫైరింజన్‌కు సమాచారం అందించారు.
ఫైరింజన్ సహాయంతో మంటలు అదుపులోకి రాగా అప్పటికే కిచెన్, హాల్లో ఉన్న ఫ్రిడ్జి, డైనింగ్ టేబుల్, టీవీ వంటి విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలాన్ని ఆర్ఐ పరిశీలించి రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.