Hyderabad | ఆన్లైన్ గేమ్స్ ఆడితే డబ్బులు పోయాయని రెండో పెళ్లి.. ఆరేండ్ల తర్వాత వెలుగులోకి మోసం
Hyderabad | ఆన్లైన్ గేమ్‌లు ఆడి అప్పులపాలైన ఓ కేటుగాడు వాటిని తీర్చేందుకు పెండ్లి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓసారి పెండ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆ మాయగాడు ఈసారి మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి మరో కుటుంబాన్ని బురిడీ కొట్టించాడు. ఈ కుతంత్రంలో అతని కుటుంబసభ్యులూ పాత్రధారులుగా ఉన్నారు.
Hyderabad | దుండిగల్, జూలై 10: ఆన్లైన్ గేమ్‌లు ఆడి అప్పులపాలైన ఓ కేటుగాడు వాటిని తీర్చేందుకు పెండ్లి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓసారి పెండ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆ మాయగాడు ఈసారి మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి మరో కుటుంబాన్ని బురిడీ కొట్టించాడు. ఈ కుతంత్రంలో అతని కుటుంబసభ్యులూ పాత్రధారులుగా ఉన్నారు.
బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా, ఎనుకూరు మండలం, రాజలింగాల గ్రామానికి చెందిన నల్లమోతు సందీప్‌కుమార్ (38), కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, మల్లంపేట్‌లో నివాసముంటున్నాడు. సందీప్‌కుమార్ రష్యాలో ఎంబీబీఎస్ చదివి గతంలోనే నీలిమ అనే మహిళను వివాహం చేసుకుని విడాకులు ఇచ్చాడు.
ఆన్లైన్ గేమ్‌లు ఆడే అలవాటున్న సందీప్ భారీగా నష్టపోయాడు. దీనినుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యుల సహకారం తో మళ్లీ పెండ్లికి సిద్ధమయ్యాడు. తాను ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ నుంచి రేడీయాలజిస్టు పూర్తి చేశానని, 2016లో ఐఏఎస్‌గా ఎంపికై కర్ణాటకలో పనిచేస్తున్నట్టు నకిలీ పత్రాలు సృష్టిం చి మ్యాట్రిమోనిలో పేరు నమో దు చేసుకున్నాడు.
ఈ వివరాలు నిజమని నమ్మిన ఏపీలోని కర్నూల్ జిల్లా, ఆదోని మండ లం, కుల్మాన్‌పేట గ్రామానికి చెందిన శ్రావణి అనే యువతి సందీప్‌కుమార్‌ను 2018లో పెండ్లి చేసుకుంది. కట్నం కింద అత్తింటివారు 8 ఎకరాల భూమిని రాసిచ్చారు. కొంతకాలం తర్వాత తన బ్యాంక్ లాకర్లో రూ.40 కోట్లు నగదు ఉందని, ఆదాయపు పన్ను చెల్లించనందున ఆ మొత్తం హోల్డ్‌లో ఉందని, అవి విడుదల కావటానికి రూ.2 కోట్లు కావాలని శ్రావణిని అడిగాడు.
దీంతో ఆమె తెలిసిన వ్యక్తుల నుంచి రుణం తీసుకొని భర్త, అతని సోదరి మోతుకూరి లక్ష్మి సాహితీ(35), మామ విజయ్‌కుమార్ (70), అత్త మాలతి(59) అకౌంట్లలోకి బదిలీ చేసింది. పెండ్లి బంగారాన్ని కుదువబెట్టడంతో శ్రావణికి అనుమానమొచ్చి నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవలు కావడంతో శ్రావణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అమెరికాలో ఉన్న సాహితి మినహా కుటుంబసభ్యులందరినీ అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- debt
- Hyderabad
- Married
- Online Loans
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

