ఆగస్టు 7న పద్మశాలీల ‘చలో ఢిల్లీ’
చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని అమలు చేయాలని ఆగస్టు 7న ఢిల్లీలో పద్మశాలీలు మ హా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత పద్మశాలి సంఘం నేత కందగట్ల స్వామి, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న వెల్లడించారు.
- జీరో జీఎస్టీ కోరుతూ మహా ప్రదర్శన
- సేలంలో పద్మశాలీల మహా ర్యాలీ
హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని అమలు చేయాలని ఆగస్టు 7న ఢిల్లీలో పద్మశాలీలు మ హా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత పద్మశాలి సంఘం నేత కందగట్ల స్వామి, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం సేలంలో ఆదివారం నిర్వహించిన పద్మశాలి మహా సంగమ ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం పన్నులు వేయడం దారుణమని, 17 నెలలుగా ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీ అమలు చేసే వరకూ పోరాడుతామని తేల్చి చెప్పారు. జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానించిందని తెలిపారు. పద్మశాలి సంఘం తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి కొకుల దేవేందర్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఇంజినీర్స్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండురంగయ్య, కార్యదర్శి వేణుమాధవ్, కర్ణాటక అధ్యక్షుడు జగదీశ్, కేరళ కార్యదర్శి సుధాకరన్, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్‌రావు, కోస్తాంధ్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, తమిళనాడు నేతలు తంగరాజన్, వేంకటాచలపతి. వరల్డ్ వీవర్స్ ఆర్గనైజషన్ సౌతిండియా ఇన్చార్జి సేతుపతి, రమేశ్, గోవిందరాజన్, సంకు సుధాకర్, చిలువేరు పురుషోత్తం, ఉమా హేమలత పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

