యాదగిరిగుట్ట, మార్చి10: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్రత్ ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం సోమవారం వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణిలో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడిని స్నానమాచరిస్తున్న సమయంలో యాదాద్రి వాసా.. యాదగిరి వాసా, గోవిందా గోవిందా నామస్మరణతో గుట్ట మార్మోగింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో నిర్వహించిన మహాపూర్ణాహుతిలో గవర్నర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.