సిరిసిల్ల/గంభీరావుపేట, అక్టోబర్ 10: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని శృంగేరీ పీఠం వేద పండితుడు వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ అన్నారు. భారతదేశం అన్ని ధర్మాలను ఆచరిస్తున్నదని, సంపూర్ణ రాజనీతిజ్ఞత కలిగి ఉన్న సీఎం కేసీఆర్ పరధర్మాన్ని ఆచరిస్తూ స్వధర్మాన్ని పాటించే మహానుభావుడని కొనియాడారు. తన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో సోమవారం నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర రథోత్సవానికి హాజరైన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. విజయదశమి పర్వదినాన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం శుభసూచకమని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోరుకొంటున్నారని చెప్పారు.