‘సింగిల్ పర్మిట్’ అమలు చేయకుంటే ఉద్యమం
చంద్రబాబు ప్రభుత్వం సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ సంఘం నాయకులు హెచ్చరించారు.
- ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ లారీ ఓనర్స్ సంఘం లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 8 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు ప్రభుత్వం సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు ప్రెసిడెంట్ సూర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు.. ఏపీలోకి లారీ వెళితే రూ. 15 వందలు ఫైన్ వేస్తున్నారు. సింగిల్ పర్మిట్ ఇవ్వాలని ఎన్నిసార్లు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తెలుగు రాష్ర్టాల మధ్య గూడ్స్ వాహనాలకు ‘కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ (సింగిల్ పర్మిట్)’ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. రాష్ట్రంలో సుమారు 2 లక్షలకు పైగా లారీలు ఉన్నాయి. దీనిలో 80 శాతం స్టేట్ పర్మిట్ ఉన్నవే. రోజు రాకపోకలు సాగించే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి’ అని తదితర వివరాలను తమ లేఖలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

