హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీకి సీఎస్ ఆదేశాలు జారీచేశారు.