యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి(Laxmi narasimha swamy )కి బుధవారం సాయంత్రం దర్బార్ సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నాలుగు వేదాలు పారాయణం చేసి, స్వామివారి స్వస్తిమంత్రార్థ వంటి మంత్రాలతో శాంతింపజేశారు. స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చి మంత్రపుష్ప నీరాజనం చేశారు. సుమారు అరగంట పాటు సాగిన సేవలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉత్సవమూర్తులకు తిరువీధి సేవ వైభవంగా సాగింది. స్వామివారిని గరుఢ వాహనం(Garuda vahanam), అమ్మవారిని తిరుచ్చి సేవపై వేంచేపు చేసి ఆలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా సాగాయి. ఉదయం స్వామి, అమ్మవార్లను గజవాహనంపై తిరుమాఢవీధుల్లో ఊరేగారు.
ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం జరిపి స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని 9వేల మంది భక్తులు(Devotees) దర్శించుకున్నారని ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి ఖజానాకు రూ.12,77,826 ఆదాయం(Income) సమకూరిందని వెల్లడించారు.