నల్లగొండ : జాతీయ రహదారులపై(National Highways) వాహనాల్లో డీజిల్ చోరీ(Stealing diesel )చేస్తున్న ముఠాను నల్లగొండ(Nallgonda) పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిన్నరగా చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల్లో ఐదుగురు ఏపీలోని పల్నాడు జిల్లా, మరొకరు సూర్యాపేట జిల్లా వాసిగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ.6 లక్షలు, 700 లీటర్ల డీజిల్, కార్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాపై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.