హైదరాబాద్ : దేవాలయాలలో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను(Inter-state robbers) పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లాలోని(Medak district) నాగిరెడ్డి పేట్, హవేలీ ఘనపూర్, చిన్న శంకరంపేట్, చేగుంటలోని ఆలయాల్లో గత నెలలో నాలుగు దొంగతనాలు జరిగాయని చెప్పారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు వేగవంతం చేశామని, చిన్న శంకరంపేట (మం) గవ్వలపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొందరు అనుమానస్పదంగా టాటామంజా కారులో తప్పించుకొనే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
వారిని చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పట్టుబడిన ముఠాలో మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన అస్లాం, షేక్ ఇలియాస్, షేక్ సమీర్‌గా గుర్తించమని ఆ ముగ్గురు పాత నేరస్థులే అని ఎస్పీ తెలిపారు. అంతరాష్ట ముఠా నుంచి మూడు సెల్ ఫోన్లు, ఒక కారు, ఐదు లక్షల 50 వేల రూపాయల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నమని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దొంగల ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందనందించారు.