నర్సింహులపేట, నవంబర్ 1 : వేలల్లో డబ్బులిస్తే లక్షల రూపాయలు ఇస్తామని నమ్మబలుకుతూ మోసం చేస్తున్న ముఠా మహబూబాబాద్ జిల్లాలోని పల్లెలు, తండాల్లో సంచరిస్తున్నది. ‘రూ.3500 స్కానర్‌కు వేస్తే.. ఎలాంటి జమానత్ లేకుండా రూ.20 లక్షలు ఇస్తాం.. మీరు చేయాల్సింది సిపుల్.. 300 చెల్లించి రూ.50 నోటరీ పేపర్‌పై మేము ఇచ్చి న వాటి పేరున ఇంగ్లిష్‌లో టైపు చేసి ఇస్తే చాలు ఒకటి రెండు రోజుల్లో డబ్బులు ఇస్తాం’ అంటూ మోసం చేస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు రూ.3,500 చొప్పున చెల్లించారని సమాచారం. ఓఎన్జీవో ఫౌండేషన్ పేరుతో కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసుకుంది. ఒక్కో కోఆర్డినేటర్‌కు ముగ్గురు చొప్పు న పరిచయం చేయాలి. ఓ వ్యక్తి పేరున ఫేస్బుక్లో ఓపెన్ చేస్తే పాకిస్థాన్‌లో స్వాతంత్య్ర వేడుకల వీడియోలు కనిపిస్తున్నాయి. ఇతడి బ్యాంకు ఖాతా మాత్రం న్యూఢిల్లీ జాలోసాలో కనిపిస్తున్నది. దీనిపై ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.