హైదరాబాద్, జూన్24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు, బీసీ గురుకులాలకు కలిపి 2ఏడీ పోస్టులుండగా, ప్రస్తుతం ఒకటి ఖాళీగా ఉన్నది. సీనియార్టీ ప్రకారం జేడీ చంద్రశేఖర్‌కు ఏడీగా ప్రమోషన్ కల్పించాలని నిర్ణయించారు. ఇక 3 జేడీ పోస్టులకు సీనియార్టీ ప్రకారం డిప్యూటీ డైరెక్టర్లు సంధ్య, మంజుల, విమలాదేవి పేర్లను డీపీసీ సిఫారసు చేసింది.
ప్రభుత్వానికి ఇటీవలనే ప్రతిపాదనలను పంపింది. కాగా, ఇటీవలనే బదిలీపై వెళ్లిన మల్లయ్యభట్టు తిరిగి సొంత డిపార్ట్‌మెంట్‌కే బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏడీ పోస్టు భర్తీపై సందిగ్ధత నెలకొన్నది. ఇదిలా ఉండగా బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ప్రమోషన్లపై కమిషనర్ సోమవారం హెచ్‌డబ్ల్యూవోలతో సమావేశం నిర్వహించారు.
పోస్ట్‌మెట్రిక్, ప్రీ మెట్రిక్ హెచ్‌డబ్ల్యూవోలకు సీనియార్టీ జాబితాను కామన్‌గా రూపొందించాలని పట్టుబట్టినట్టు తెలుస్తున్నది. కోర్టు ఆర్డర్లకు విరుద్ధంగా కొందరికి దొడ్డిదారిన ప్రమోషన్లు ఎలా ఇస్తారని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితాను రూపొందిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్టు హెచ్‌డబ్ల్యూవోలు వెల్లడించారు.